Feb 21, 2008

మీ కంప్యూటర్ లో exe ఫైల్స్ గురించి భయపడుతున్నారా?


కంప్యూటర్ లో ".exe" ఫైళ్ళు ఎన్ని ఎక్కువ రన్ అవుతుంటే, సిస్టమ్ అంత స్లో అవుతుంది. దీనికి కారణం ప్రతి exe ఫైలూ ప్రోససర్ యొక్క విలువైన శక్తిని ఎంతో కొంత వినిమయం చేస్తుంది కాబట్టి. exelib.com మీకు exe ఫైళ్ళ గురించి వివరాలను అందిస్తుంది. ఏ exe ఫైలు ఎందుకోసం? దాని వివరాలు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఆ ఫైలు ఎంత రిస్క్ తో్ కూడుకున్నది? వంటి అన్ని వివరాలను అందులో చూడచ్చు. మీ కంప్యూటర్ లోని టాస్క్ మేనేజర్ ని ఉపయోగించి, మీ సిస్టమ్ లో ఏఏ exe ఫైల్స్ ఉన్నాయి? అవి అవసరమైనవా కావా? అన్నది తెలుసుకుని, అనవసరమైన వాటిని తొలగించుకోవచ్చు. ఎందుకంటే ఎంత తక్కువ exe ఫైళ్ళో అంత ఎక్కువ కంప్యూటర్ స్పీడ్ మరి.

Feb 19, 2008

మీరు Thesis ని Organize చే్సుకోవాలనుకున్నా, లేదా Phd Thesis వ్రాయాలనుకున్నా ... గైడెన్స్ ఇచ్చే మంచి వెబ్ సైట్.


మీకు, మీ థీసెస్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి? Phd థీసెస్ ని ఎలా వ్రాయాలి? మంచి యూనివర్సిటీలు ఏమి ఉన్నాయి? వంటి సమస్యలు ఉంటే, వాటిని అధిగమించటానికి మరియు అనుభవజ్ఞుల గైడెన్స్ కావాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఆశ్రయించండి.
IndiaStudyCenter.com

ఉచిత CSS TEMPLATES మీ కోసం.

ఇంతకుముందు ఎన్నాడూ చూడని అందమైన CSS TEMPLATES ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఈ సైటు కలిగిస్తూ ఉంది. మొత్తం 139 టెంప్లేట్లు ఉన్నాయి ఈ సైట్ లో. మీకు కావలిసినవి Zip ఫార్మాట్ లోకి మీరు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Feb 18, 2008

మీరు ఇండియాలో ఏదైనా సిటిలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా?

అయితే మాజిక్ బ్రిక్స్ అనే ఈ సైటుని దర్శించండి. ఇండియా లో అన్ని ప్రముఖ పట్టణాలలో ఏ ఏరియాలో కావాలనుకుంటే ఆ ఏరియాలో, మీకు ఏ బడ్జట్ లో కావాలంటే ఆ బడ్జట్ లో దొరికే ఇళ్ళ రేట్లు, కొలతలు, ఎవరిని సంప్రదించాలి? వంటి అన్ని వివరాలూ బ్రోకర్ తో పనిలేకుండానే దొరుకుతాయి.

ప్రపంచంలో అన్ని ప్రముఖ దినపత్రికల హెడ్ లైన్స్ ఒకే దగ్గర చూడాలనుకుంటున్నారా?


Newseum అనే ఈ సైట్ లో 50 దేశాలకు చెందిన దాదాపు 500 దినపత్రికల మొదటి పేజీలు ఉంటాయి. ఒకే వార్తని ఏ పేపరు ఎలా వ్రాసిందో చూడటానికి ఇది ఓ మంచి వేదిక.

Feb 16, 2008

మీకు నచ్చిన ఫోటో ని, అలలు అలలు గా తేలిపోతూ ముక్కలయి మళ్ళీ అతకబడేలా అందం గా మార్చుకోవాలనుకుంటున్నారా?


Pixifex
నుండి మీకు నచ్చిన ఫోటో ని, అలలు అలలు గా తేలిపోతూ ముక్కలు ముక్కలుగా విడి పోయి తిరిగి అతికింపబడే ఫ్లాష్ ఎఫెక్ట్స్ లాగ సులభంగా మార్చుకోవచ్చు . చూడటానికి ఎంతో అందంగా క్వాలిటీగా కనిపించి, కనువిందు చేస్తుంది మీ ఫోటో.

HTML. JAVA Script, Web Design లకు సంబంధించిన సైట్ల వివరాలు.

Department of Information Technology, New Delhi వారి సైట్ లో HTML. JAVA Script, Web Design మరియు ఇతర విషయాలగురించి ఎంతో ఉపయోగకరమైన అనేక Website ల లిస్టు ఇచ్చిఉన్నారు. విద్యార్ధులకు, ప్రొఫెషనల్స్ లకు విలువైన సమాచారం లభిస్తుంది ఆ సైట్ల నుండి.

డౌన్ లోడ్ జంఝాటం లేకుండా Image, Doc, Audio, Video ఫైల్స్ ని నేరుగా Convert చేసుకోవచ్చు.

ZAMZAR - Free online file conversion - డౌన్ లోడ్ అవసరం లేకుండానే ఆన్ లైన్ లో Image, Document, Audio, Video ఫైల్స్ ని ఎంతో సులభంగా Convert చేసుకోవచ్చు. ఫైల్ యొక్క అధికాధిక సైజు 100 MB కన్నా ఎక్కువ ఉండకూడదు.